థాయిలాండ్

Context of థాయిలాండ్

థాయ్‌లాండ్ అధికారికంగా కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్ గా పిలువబడుతుంది. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది. థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్,కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, మలేషియా, పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ యందు వియత్నాం, ఇండోనేషియా, భారతదేశం ఉన్నాయి. ఇది దక్...పూర్తిగా చదవండి

థాయ్‌లాండ్ అధికారికంగా కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్ గా పిలువబడుతుంది. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది. థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్,కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, మలేషియా, పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ యందు వియత్నాం, ఇండోనేషియా, భారతదేశం ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనికదళాధిపతి, బౌద్ధమతానునయుడు, అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.

థాయ్‌లాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ల (1,96,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో, ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. థాయ్‌లాండ్‌లో అతిపెద్ద, రాజధాని నగరం బాంకాక్. బాంకాక్ థాయ్‌లాండ్ దేశానికి రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. థాయ్‌లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు థాయ్ చైనీయులు, 3% మంది ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు. మిగిలిన అల్పసంఖ్యాకులలో మోనులు, ఖెమరానులు, వివిధ గిరిజన సంప్రదాయానికి చెందినవారు కలరు. థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్, మతం బౌద్ధమతం. బౌద్ధమతాన్ని థాయ్‌లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985, 1996లో అతివేగంగా ఆర్థికాభివృద్ధి చెంది, ప్రస్తుతం ఒక పారిశ్రామిక దేశంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా తయారైనది. దేశాదాయంలో పర్యాటక రంగం కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. దేశంలో, చట్టబద్ధంగా, చట్టవ్యతిరేకంగా, 20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు.

Map

Videos