పెరూ

Context of పెరూ

పెరూ (ఆంగ్లం Perú), ( స్పానిష్ : పెరూ ; క్వెచువా : పెరు లేదా Piruw ; ( ఐమారా : పిర్యూ) అధికారికంగా పెరూ రిపబ్లిక్ ( స్పానిష్ : రిపబ్లికా డెల్ పెరూ ")" దక్షిణ అమెరికా " లోని వాయువ్యభాగంలో ఉన్న ఒక దేశం. పెరూ దక్షిణ సరిహద్దులో చిలీ , పశ్చిమ సరిహద్దులో " పసిఫిక్ మహాసముద్రం " ఆగ్నేయ సరిహద్దులో బొలీవియా, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, ఉత్తర సరిహద్దులో ఈక్వడార్ , కొలంబియా దేశాలు ఉన్నాయి.పెరూ వైవిధ్యమైన భగోళికస్థితి , పర్యావరణం కలిగి ఉంటుంది.పశ్చిమంలో పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్న అరిడ్ మైదానాలు ఉన్నాయి. ఉత్తరం నుండి ఆగ్నేయం వరకు ఆండెస్ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి.తూర్పున ఉన్న అమెజాన్ నదీముఖద్వారంలో ఉష్ణమండల వర్షారణ్యాలు విస్తరించి ఉన్నాయి.

కొలంబియన్ పూర్వ అమెరికా ఖండాలలో అతిపెద్ద దేశం , అత్యాధునికమైన ఇంకా సామ్రాజ్యంలో క్రీ.పూ 32వ శతాబ్ధంలో పెరూలో అమెరికా ఖండాలలో పురాతన సంస్కృతులలో ఒకటి అయిన ఉత్తర చికో నాగరికత విస్తరించి ఉంది. 16 వ శతాబ్దంలో స్పానిష్ సామ్రాజ్యం ఈప్రాంతాన్ని గెలుచుకుని తన దక్షిణ అమెరికా కాలనీగా చేసుకుని " లిమా "ను రాజధానిగా చ...పూర్తిగా చదవండి

పెరూ (ఆంగ్లం Perú), ( స్పానిష్ : పెరూ ; క్వెచువా : పెరు లేదా Piruw ; ( ఐమారా : పిర్యూ) అధికారికంగా పెరూ రిపబ్లిక్ ( స్పానిష్ : రిపబ్లికా డెల్ పెరూ ")" దక్షిణ అమెరికా " లోని వాయువ్యభాగంలో ఉన్న ఒక దేశం. పెరూ దక్షిణ సరిహద్దులో చిలీ , పశ్చిమ సరిహద్దులో " పసిఫిక్ మహాసముద్రం " ఆగ్నేయ సరిహద్దులో బొలీవియా, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, ఉత్తర సరిహద్దులో ఈక్వడార్ , కొలంబియా దేశాలు ఉన్నాయి.పెరూ వైవిధ్యమైన భగోళికస్థితి , పర్యావరణం కలిగి ఉంటుంది.పశ్చిమంలో పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్న అరిడ్ మైదానాలు ఉన్నాయి. ఉత్తరం నుండి ఆగ్నేయం వరకు ఆండెస్ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి.తూర్పున ఉన్న అమెజాన్ నదీముఖద్వారంలో ఉష్ణమండల వర్షారణ్యాలు విస్తరించి ఉన్నాయి.

కొలంబియన్ పూర్వ అమెరికా ఖండాలలో అతిపెద్ద దేశం , అత్యాధునికమైన ఇంకా సామ్రాజ్యంలో క్రీ.పూ 32వ శతాబ్ధంలో పెరూలో అమెరికా ఖండాలలో పురాతన సంస్కృతులలో ఒకటి అయిన ఉత్తర చికో నాగరికత విస్తరించి ఉంది. 16 వ శతాబ్దంలో స్పానిష్ సామ్రాజ్యం ఈప్రాంతాన్ని గెలుచుకుని తన దక్షిణ అమెరికా కాలనీగా చేసుకుని " లిమా "ను రాజధానిగా చేసుకుని వైస్‌రాయల్టీ ఏర్పాటు చేసింది. 1821 లో పెరూ స్వాతంత్ర్యం సాధించిన తరువాత డీ శాన్ మార్ట్న్ , సైమన్ బొలివర్ నాయకత్వంలో సైనిక తిరుబాటు , అయాకుచో మోసపూరిత యుద్ధం తరువాత 1824 వరకు పెరూ స్వతంత్రం సురక్షితంగా ఉంది. తరువాత సంవత్సరాలలో పెరూ ఆర్ధిక , రాజకీయ స్థిరత్వం అనుభవించింది.స్వల్పకాలం కొనసాగిన స్థిరత్వం చిలీతో సంభవించిన పసిఫిక్ యుద్ధంకారణంగా ముగింపుకు వచ్చింది. 20వ శతాబ్ధం అంతా పెరూ సరిహద్దు వివాదాలు, తిరుగుబాట్లు, సాంఘిక అశాంతి , అంతర్గత యుద్ధాల వంటి సమస్యలను ఎదుర్కొన్నది.

పెరూ ప్రజాస్వామ్య గణతంత్రం 25 ప్రాంతాలుగా విభజించబడింది. పెరూ అత్యఉన్నత మానవ అభివృద్ధి సూచిక కలిగి ఉంది. 25.8% ప్రజలు పేదరికం అనుభవిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించబడుతుంది. దేశ ఆర్థిక కార్యకలాపాలలో మైనింగ్, తయారీ రంగం, వ్యవసాయం , చేపలు పట్టడం ప్రధానంగా ఉన్నాయి.2015 గణాంకాల ఆధారంగా పెరువియన్ జనాభా 31.2 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీరిలో అమెరిన్డియన్లు, ఐరోపియన్లు, ఆఫ్రికన్లు , ఆసియన్లు ఉన్నారు. ప్రధానంగా మాట్లాడే భాష స్పానిష్. అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో పెరువియన్లు క్వెచువా లేదా ఇతర స్థానిక భాషలను మాట్లాడతారు. సాంస్కృతిక సంప్రదాయాల మిశ్రమం ఫలితం కళ, వంటకాలు, సాహిత్యం , సంగీతం వంటి రంగాలను ప్రభావితం చేస్తూ వ్యక్తీకరణలో విస్తృత వైవిద్యం కలిగి ఉంది.

Map

Videos