ఈజిప్టు

  • Saqqara

Context of ఈజిప్టు

ఈజిప్టు (ఆంగ్లం : Egypt), అధికారికనామం అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, ( ˈiː.dʒɪpt , ఈజిప్షియన్: కెమెత్; అరబ్బీ : مصر ; (మిస్ర్, మిసర్, మసర్). ఇది ఆఫ్రికా ఈశాన్యమూలలో ఉంటుంది. ఉత్తర ఆఫ్రికాలోని సినై ద్వీపకల్పం ఏర్పరచిన భూవారధి ఈజిప్టుని పశ్చిమ ఆసియా భూవారధిగా చేసింది. ఈజిప్టుకి సరిహద్దులుగా ఉత్తరాన మెడిటేరియను సముద్రము ఈశాన్యసరిహద్దులో గజాస్ట్రిపు, ఇజ్రాయిల్, తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, పశ్చిమసరిహద్దులో లిబియా ఉన్నాయి. తూర్పుసరిహద్దులో అక్వాబా గల్ఫు, ఎర్రసముద్రం ఉన్నాయి. దక్షిణసరిహద్దులో సూడాన్ ఉన్నాయి. అక్వాబా గల్ఫు దాటిన తరువాత జోర్డాను, ఎర్రసద్రం దాటిన తరువాత సౌదీ అరేబియా, మధ్యధరా సముద్రం దాటిన తరువాత గ్రీసు, టర్కీ, సైప్రసు ఉన్నాయి.


ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాచీన దేశం. ఈజిప్టులో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. ఈజిప్ట్ అధికారికంగా పిలవబడే పేరు అరబ్ రిపబ్లిక్ అఫ్ ఈజిప్టు,దీని వైశాల్యము సుమారు 10,10,000 చదరపు కిలోమీటర్ల...పూర్తిగా చదవండి

ఈజిప్టు (ఆంగ్లం : Egypt), అధికారికనామం అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, ( ˈiː.dʒɪpt , ఈజిప్షియన్: కెమెత్; అరబ్బీ : مصر ; (మిస్ర్, మిసర్, మసర్). ఇది ఆఫ్రికా ఈశాన్యమూలలో ఉంటుంది. ఉత్తర ఆఫ్రికాలోని సినై ద్వీపకల్పం ఏర్పరచిన భూవారధి ఈజిప్టుని పశ్చిమ ఆసియా భూవారధిగా చేసింది. ఈజిప్టుకి సరిహద్దులుగా ఉత్తరాన మెడిటేరియను సముద్రము ఈశాన్యసరిహద్దులో గజాస్ట్రిపు, ఇజ్రాయిల్, తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, పశ్చిమసరిహద్దులో లిబియా ఉన్నాయి. తూర్పుసరిహద్దులో అక్వాబా గల్ఫు, ఎర్రసముద్రం ఉన్నాయి. దక్షిణసరిహద్దులో సూడాన్ ఉన్నాయి. అక్వాబా గల్ఫు దాటిన తరువాత జోర్డాను, ఎర్రసద్రం దాటిన తరువాత సౌదీ అరేబియా, మధ్యధరా సముద్రం దాటిన తరువాత గ్రీసు, టర్కీ, సైప్రసు ఉన్నాయి.


ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాచీన దేశం. ఈజిప్టులో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. ఈజిప్ట్ అధికారికంగా పిలవబడే పేరు అరబ్ రిపబ్లిక్ అఫ్ ఈజిప్టు,దీని వైశాల్యము సుమారు 10,10,000 చదరపు కిలోమీటర్లు (3,90,000 చదరపు మీటర్లు),

. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లోని అధిక జనాభా గల దేశాలలో ఈజిప్టు ముఖ్యమైనిది. 7.6 కోట్ల జనాభాలో ఎక్కువ భాగం నైలు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఇది సుమారు 40,000 చదరపు కిలోమీటర్లు (15,000 చదరపు మీటర్లు) వైశాల్యం విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అక్కడే వ్యవసాయానికి అనుకూలంగా సాగుభూమిని కనుగొన్నారు. సహారా ఎడారిలో అధిక భూభాగం ఎవ్వరూ నివసించరు. ఈజిప్టు జనాభాలోని సుమారు సగభాగం పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు, వీరిలో ఎక్కువ భాగం అధిక జనసాంద్రత గల కైరో, అలెక్షాన్ద్రియా, మిగతా పెద్ద నగరాలైన నిలే డెల్టాలలో వ్యాపించి ఉన్నారు. ఈజిప్టు పురాతన నాగరికతకు పేరుగాంచినది, ప్రపంచ ప్రసిధి గాంచిన పురాతనమైన, గిజా పిరమిడ్ భవనం, గ్రేట్ స్ఫిన్క్ష్ ఉన్నాయు. లక్షర్ నగరం యొక్క దక్షిణ భాగంలో చాలా పురాతన మైన కట్టడాలు, కర్నక్ గుడి, వ్యాలీ అఫ్ ది కింగ్స్ ఉన్నాయు. మిడిల్ ఈస్ట్ లో ఈజిప్టును ముఖ్యమైన రాజకీయ, సాంసృతిక దేశంగా పరిగణిస్తారు. మిడిల్ ఈస్ట్ లో ఈజిప్టుని ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందిన దేశంగా పేరుగాంచినది. విహారం, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలలో ఈ దేశం ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిలో సగభాగం ఉంటుంది. దీనికి అనుగుణంగా ఈజిప్టు యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులను ఆకర్షించడం కోసం చట్టాలను అమలు చేయడంతో పాటు అమలులోకి తీసుకు రావడం దానితో పాటు అంతరంగిక, రాజకీయ నిచలతతో పాటు అధునాతన వ్యాపారం, విపణి స్వేచ్ఛాతత్వం కలిగి ఉంటుంది.


ప్రపంచదేశాలలో సుదీర్ఘ చరిత్రకలిగిన దేశాలలో ఈజిప్టు ఒకటి. వారసత్వం క్రీ.పూ. 6 వ -4 వ శతాబ్దం మద్యకాలం నుండి గుర్తించబడుతుంది. ఈజిప్టు నాగరికత ఒకానొక నాగరికతకు జన్మస్థానంగా పరిగణించబడుతుంది. ప్రాచీన ఈజిప్టు రచన, వ్యవసాయం, పట్టణీకరణ, వ్యవస్థీకృత మతం, కేంద్ర ప్రభుత్వం, ప్రారంభ అభివృద్ధిలో భాగంగా ఉన్నాయి. గిజా నెక్రోపోలిసు దాని గ్రేటు స్పింక్సు వంటి స్మారక కట్టడాలు, మెంఫిసు, తెబెసు, కర్నాకు, కింగ్సు లోయ శిధిలాలు ఈ వారసత్వాన్ని, శాస్త్రీయదృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఈజిప్టు జాతీయ గుర్తింపులో సుదీర్ఘమైన సాంస్కృతిక వారసత్వం అంతర్భాగంగా ఉంది. ఇది గ్రీకు, పర్షియను, రోమను, అరబు, ఒట్టోమను టర్కీ, నూబియనులతో పలు విదేశీ సంస్కృతులను ప్రభావితం చేసి తరచూ సమ్మిళితమైంది. ఈజిప్టు క్రైస్తవ మతం ప్రారంభ, ముఖ్యమైన కేంద్రంగా ఉంది. కానీ ఇది 7 వ శతాబ్దంలో ఎక్కువగా ఇస్లాంకరించబడింది. గణనీయమైన క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గం ఉన్నప్పటికీ ప్రధానంగా ముస్లిం దేశంలో ఉంది.

16 వ నుండి 20 వ శతాబ్దం ప్రారంభం వరకు, ఈజిప్టు విదేశీ సామ్రాజ్య శక్తులు: ఒట్టోమను సామ్రాజ్యం, బ్రిటీషు సామ్రాజ్యం పాలించాయి. 1922 నాటికి బ్రిటీషు సామ్రాజ్యం నుండి ఆధునిక ఈజిప్టు రాచరిక వ్యవస్థ నామమాత్ర స్వతంత్రం పొందింది. అయినప్పటికీ ఈజిప్టు బ్రిటీషు సైనిక ఆక్రమణ కొనసాగింది. చాలామంది ఈజిప్షియన్లు బ్రిటిషు వలసవాదానికి రాజరికం ఒక సాధనమని నమ్మారు. 1952 తిరుగుబాటు తరువాత ఈజిప్టు బ్రిటీషు సైనికులను, బ్యూరోక్రాట్లను బహిష్కరించడంతో బ్రిటీషు ఆక్రమణ ముగిసింది. బ్రిటిషుకు ఆధీనంలో ఉన్న సూయజు కెనాలును జాతియం చేసి రాజా ఫరూకును, అతని కుటుంబాన్ని బహిష్కరించి స్వతంత్రం ప్రకటించింది. 1958 లో యునైటెడు అరబు రిపబ్లికును రూపొందించడానికి సిరియాలో విలీనం అయ్యింది. 20 వ శతాబ్దం రెండవ సగభాగంలో ఈజిప్టు 1948, 1956, 1967 ఇజ్రాయెలుతో పలు సాయుధ పోరాటాలు చేస్తూ సామాజిక, మత కలహాలు, రాజకీయ అస్థిరతలను ఎదుర్కొంది. 1973 - 1967 వరకు గాజా స్ట్రిపు అగ్రస్థానంలో ఉంది. 1978 లో ఈజిప్టు క్యాంపు డేవిడు ఒప్పందంపై సంతకం చేసింది. అధికారికంగా గాజా స్ట్రిపు నుండి ఉపసంహరించుకుని ఇజ్రాయెల్ను గుర్తించింది. ఇటీవల 2011 విప్లవం పరిణామాలతో సహా రాజకీయ అశాంతిని, దేశం తీవ్రవాదం, ఆర్థికాభివృద్ధి క్షీణతకు దారితీసింది. ఈజిప్టు ప్రస్తుత ప్రభుత్వం ప్రెసిడెన్షియలు రిపబ్లికుకు అధ్యక్షుడు అబ్దేలు " ఫతేహు ఎల్-సిసీ " నేతృత్వం వహిస్తున్నాడు.

ఈజిప్టు అధికారిక మతం ఇస్లాం, అధికారిక భాష అరబికు. 95 మిలియన్ల మంది నివాసితులతో ఈజిప్టు ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, అరబు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేశాల్లో ఒకటిగా ఉంది. ఆఫ్రికాలో మూడవ-అత్యంత జనసంఖ్య కలిగిన (నైజీరియా, ఇథియోపియా తరువాత)దేశంగానూ ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 15 వ స్థానంలో ఉంది. జనాభాలో అధిక భాగం సాగు భూమి అధికంగా ఉండే నైలునదీ తీరంలో నివసిస్తున్నారు. 40,000 చ.కి.మీ. ప్రాంతంలో మాత్రమే నివసిస్తారు. ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈజిప్టు భూభాగంలో అధిక భాగాన్ని కలిగి ఉన్న సహారా ఎడారిలోని విస్తారమైన ప్రాంతాలలో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. ఈజిప్టు నివాసితులలో సగం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఎక్కువ మంది కైరో, అలెగ్జాండ్రియా, నైలు డెల్టాలోని ఇతర జన సాంద్రత గల ప్రధాన నగర ప్రాంతాలలో విస్తరించారు.

ఈజిప్టు సార్వభౌమ రాజ్యం ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ముస్లిం ప్రపంచం ప్రాంతీయ శక్తిగా ప్రపంచవ్యాప్తంగా మధ్యవర్తిత్వ శక్తి పరిగణించబడుతుంది. ఈజిప్టు ఆర్ధిక వ్యవస్థ మధ్యప్రాచ్యంలో అతిపెద్దదైనదిగానూ, వైవిధ్యపూరితమైనదిగానూ ఉంటుంది. 21 వ శతాబ్దంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధికశక్తిగా మారుతుందని భావిస్తున్నారు. 2016 లో ఈజిప్టు దక్షిణాఫ్రికాను అధిగమించి, నైజీరియా తరువాత ఆఫ్రికా రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఐక్యరాజ్యసమితి, నాన్-అలైండ్ ఉద్యమం, అరబు లీగు, ఆఫ్రికా యూనియన్, ఇస్లామికు సహకార సంస్థ వ్యవస్థాపక సంస్థగా ఉంది.

Map

Videos