ఖార్దుంగ్ లా కనుమ

ఖార్దుంగ్ లా కనుమ

ఖార్దుంగ్ లా (ఖార్దుంగ్ కనుమ, లా అంటే టిబెట్ భాషలో కనుమ) అనేది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతపు లేహ్ జిల్లాలోని ఒక కనుమ. స్థానిక ఉచ్చారణలో "ఖార్దోంగ్ లా" అనీ, "ఖార్ద్‌జోంగ్ లా" అనీ అంటారు.

లడఖ్ శ్రేణిలో ఉన్న ఈ కనుమ లేహ్‌కు ఉత్తరాన ఉంది. ఇది ష్యోక్, నుబ్రా లోయలకు ముఖద్వారం. సియాచిన్ హిమానీనదం. 1976 లో నిర్మించిన ఈ కనుమ దారిని 1988 లో పబ్లిక్ మోటారు వాహనాలు వెళ్ళేందుకు తెరిచారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న ఈ కనుమ భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. సియాచిన్ హిమానీనదానికి సామాగ్రిని ఈ కనుమ గుండానే తీసుకు వెళ్తారు.

ఖార్దుంగ్ లా ఎత్తు 5,359 m (17,582 ft) . స్థానిక రోడ్డు సూచికలు, లేలో చొక్కాలు విక్రయించే డజన్ల కొద్దీ దుకాణాలూ దాని ఎత్తు 5,602 m (18,379 ft) అనీ, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాహనయోగ్య కనుమ అనీ తప్పుగా పేర్కొంటాయి.

Photographies by: