సూడాన్
Context of సూడాన్
సూడాన్ (ఆంగ్లం: Sudan) అధికారిక నామం, రిపబ్లికు ఆఫ్ సూడాను ( అరబ్బీ భాష : جمهوريةالسودان ). ఈశాన్య ఆఫ్రికాలో ఉన్న దేశం. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం. అరబు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. దీని ఉత్తరసరిహద్దులో ఈజిప్టు, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఎరిట్రియా, ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పశ్చిమసరిహద్దులో చాద్, వాయవ్యసరిహద్దులో లిబియా లు, దక్షిణసరిహద్దులో దక్షిణ సూడాన్ ఉన్నాయి. 2016 లో దేశ జనసంఖ్య 39 మిలియన్లు ఉన్నట్లు అంచనా. దేశవైశాల్యం 18,86,068 చ.కి.మీ (7,28,215 చ.మై). సుడానులో ఇస్లాం మతం ఆధిక్యతలో ఉంది. అధికార భాషలుగా అరబికు, ఆంగ్లం ఉన్నాయి. కార్టం సుడాను రాజధాని నగరంగా ఉంది. ఇది నైలు, బ్లూ నదుల సంగమ ప్రాంతంలో ఉంది. 2011 నుండి కార్డోఫను, బ్లూ నైలు ప్రాంతాలు మతకలహాలకు కేంద్రంగా ఉన్నాయి.
సుడాను చరిత్ర ఫారానికు కాలానికి చెందినది. కెర్మా రాజ్యం (క్రీ.పూ. 2500 -క్రీ.పూ 1500 ), ఈజిప్టు న్యూ కింగ్డం (క్రీ.పూ.1500 -1070 క్రీ.పూ), తరువాత పాలన, కుషు రాజ్యం అభివృద్ధి క్రీ.పూ....పూర్తిగా చదవండి
సూడాన్ (ఆంగ్లం: Sudan) అధికారిక నామం, రిపబ్లికు ఆఫ్ సూడాను ( అరబ్బీ భాష : جمهوريةالسودان ). ఈశాన్య ఆఫ్రికాలో ఉన్న దేశం. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం. అరబు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. దీని ఉత్తరసరిహద్దులో ఈజిప్టు, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఎరిట్రియా, ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పశ్చిమసరిహద్దులో చాద్, వాయవ్యసరిహద్దులో లిబియా లు, దక్షిణసరిహద్దులో దక్షిణ సూడాన్ ఉన్నాయి. 2016 లో దేశ జనసంఖ్య 39 మిలియన్లు ఉన్నట్లు అంచనా. దేశవైశాల్యం 18,86,068 చ.కి.మీ (7,28,215 చ.మై). సుడానులో ఇస్లాం మతం ఆధిక్యతలో ఉంది. అధికార భాషలుగా అరబికు, ఆంగ్లం ఉన్నాయి. కార్టం సుడాను రాజధాని నగరంగా ఉంది. ఇది నైలు, బ్లూ నదుల సంగమ ప్రాంతంలో ఉంది. 2011 నుండి కార్డోఫను, బ్లూ నైలు ప్రాంతాలు మతకలహాలకు కేంద్రంగా ఉన్నాయి.
సుడాను చరిత్ర ఫారానికు కాలానికి చెందినది. కెర్మా రాజ్యం (క్రీ.పూ. 2500 -క్రీ.పూ 1500 ), ఈజిప్టు న్యూ కింగ్డం (క్రీ.పూ.1500 -1070 క్రీ.పూ), తరువాత పాలన, కుషు రాజ్యం అభివృద్ధి క్రీ.పూ. 785 -సా.శ. 350 ) దాదాపుగా ఒక శతాబ్దం పాటు ఈజిప్టును నియంత్రించాయి. కుషు పతనం తరువాత న్యూబియన్లు మూడు క్రైస్తవ రాజ్యాలుగా నోటియా, మాకురియా, అలోడియాలను స్థాపించారు. సుమారు సా.శ. 1500 వరకు ఇది కొనసాగింది. 14 - 15 వ శతాబ్దాలలో సుడానులో చాలా మంది అరబు సంచారప్రజలు స్థిరపడ్డారు. 16 వ -19 వ శతాబ్దాలలో కేంద్ర, తూర్పు సూడానును ఫంజు సుల్తానేటు ఆధిపత్యం చేసాయి. డార్ఫూరు పశ్చిమప్రాంతాన్ని పాలించగా, ఒట్టోమను ఉత్తరప్రాంతాన్ని పాలించింది. ఈ కాలంలో విస్తృతమైన ఇస్లామీకరణ, అరేబియీరణను చూసింది.
1820 నుండి 1874 వరకు సూడాను మొత్తాన్ని ముహమ్మదు ఆలీ వంశీయులు స్వాధీనం చేసుకున్నారు. 1881 - 1885 మధ్యకాలంలో కఠినమైన ఈజిప్టు పాలన స్వీయ-ప్రకటిత మహ్దీ ముహమ్మదు అహ్మదు నేతృత్వంలోని విజయవంతమైన తిరుగుబాటుతో ముగింపుకు వచ్చింది. ఫలితంగా ఓమ్డర్మను కాలిఫటు స్థాపన జరిగింది. చివరికి బ్రిటిషు 1898 లో ఈ దేశం పతనం చేసింది. తరువాత సుడానును ఈజిప్టుతో కలిపి పాలించారు.
20 వ శతాబ్దం సుడాను జాతీయవాదం అభివృద్ధి చెందింది. 1953 లో బ్రిటను సుడాను స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వాన్ని మంజూరు చేసింది. స్వాతంత్ర్యం తరువాత సూడాను అస్థిర పార్లమెంటరీ ప్రభుత్వాలు, సైనిక ప్రభుత్వాలు వరుసక్రమంలో పాలించాయి. 1983 లో గాఫారు నిమేరీ ఆధ్వర్యంలో సూడాను ఇస్లామికు చట్టం ఏర్పాటు చేయబడింది. ఇది ఇస్లామికు ఉత్తరప్రాంతంలో ప్రభుత్వస్థానానికి, దక్షిణప్రాంతంలో ఉన్న అనిమిస్టు, క్రైస్తవులకు మధ్య విబేధనాన్ని మరింత తీవ్రతరం చేసింది. నేషనలు ఇస్లామికు ఫ్రంటు (ఎన్ఐఎఫ్), దక్షిణ ఆఫ్రికా తిరుగుబాటుదారులచే ప్రభావితమైన ప్రభుత్వ దళాల మధ్య పౌర యుద్ధంలో భాష, మతం, రాజకీయ అధికారంలో తేడాలు ఆధిక్యతవహించాయి. దీని ఫలితంగా సుడాను పీపుల్సు లిబరేషను ఆర్మీ (ఎస్.పి.ఎల్.ఎ) 2011 లో దక్షిణ సుడాను స్వతంత్ర దేశంగా అవతరించడం సంభవించాయి. 2019 ఏప్రెలులో ఒమరు అలు బషీర్ పాలన తీవ్ర వ్యతిరేకతను, వివాదాస్పదమైన నిరసనలు ఎదుర్కొన్నది. అహ్మదు ఆవాదు ఇబ్ను అఫు ఆధ్వర్యంలో సూడాను సైన్యం నియంత్రణలో మద్యంతర సైనిక మండలిని స్థాపించబడింది. ఈ చర్య అలు-బషీరును తొలగించి రాజ్యాంగం రద్దు చేసింది. బషీరును ఇంటర్నేషనలు క్రిమినలు కోర్టుకు అప్పగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొనసాగిన నిరసనల కారణంగా మద్యంతర సైనిక మండలిని స్థాపించిన అహ్మదు అవదు ఇబ్ను అసఫు పదవి నుండి వైదొలిగాడు.